Sora Turbo: టెక్నాలజీలో కొత్త యుగం!
OpenAI తన నూతన టెక్నాలజీ Sora Turboతో మరో మైలురాయిని అందుకుంది. దీని ద్వారా మీ ఆలోచనలను కొన్ని కమాండ్లతోనే వీడియోలుగా మారుస్తుంది.
Sora Turbo అంటే ఏమిటి?
Sora Turbo ఒక మల్టీ-మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో జనరేటర్. ఇది టెక్ట్స్‌ను వీడియోలుగా మారుస్తుంది. మీకు కావాల్సినదాన్ని సులభంగా మోషన్ పిక్చర్ రూపంలో పొందవచ్చు. ప్రస్తుతం, ఇది ChatGPT Plus మరియు ChatGPT Pro వినియోగదారులకు అందుబాటులో ఉంది.
Sora Turbo ఫీచర్లు
- వాక్యాలను వీడియోలుగా మార్చడం: టెక్ట్స్‌ను విజువల్స్‌గా మారుస్తుంది.
- క్లిప్స్‌ను రీ-ఇమాజిన్ చేయడం: ఫొటోలు, వీడియో క్లిప్స్ ఇన్‌పుట్‌గా ఇస్తే కొత్త వీడియోలను సృష్టిస్తుంది.
- 1080 పిక్సెల్ హై-క్వాలిటీ వీడియోలు: 20 సెకన్ల డ్యూరేషన్ గల వీడియోలను రూపొందించవచ్చు.
- రిమిక్స్ ఫీచర్: వీడియోలోని క్లిప్స్‌ను తొలగించడం, మార్చడం లేదా మళ్లీ సృష్టించడం చాలా సులభం.
- స్టోరీబోర్డ్ ఫీచర్: మీ కథలకు ప్రత్యేక సీక్వెన్స్‌లు టైమ్‌లైన్‌లో జోడించవచ్చు.
ఎక్కడ లభించనుంది?
ప్రస్తుతం Sora Turbo భారత్, కెనడా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
భద్రతతో కూడిన AI
- అనవసరమైన కంటెంట్‌ను అడ్డుకోవడం: డీప్ ఫేక్‌లు మరియు పిల్లల భద్రతకు ప్రమాదకరమైన కంటెంట్‌ను నిరోధిస్తుంది.