ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ సర్వసాధారణమైపోయింది. అయితే, వాషింగ్ మెషీన్లో కూడా పాములు దూరుతాయనే విషయం మాత్రం సాధారణమైంది కాదు మీకు తెలుసా అవును మీరు చదివింది నిజమే.. వర్షాకాలంలో పాములు పొడి ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి దూరుతాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఈ సారి ఓ ఇంట్లో దూరిన పాము.. అక్కడ ఇక్కడ కాకుండా ఏకంగా వాషింగ్ మెషీన్లో దూరింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. బట్టలు వాషింగ్ మెషీన్లో వేసేందుకు వచ్చిన ఆ మహిళకు నల్లటి ఆకారంతో నాగుపాము పడగవిప్పి షాక్ కి గురైన ఇంటి ఇల్లాలి. ఈ వీడియో రాజస్థాన్‌లోని కోటా నగరానికి చెందినదిగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒక నాగుపాము వాషింగ్ మెషీన్లోపల పడగ విప్పి ఉంది. ఆ ఇంట్లోవారు వాషింగ్ మెషీన్లో బట్టలు వేయడానికి వెళ్ళినప్పుడు, లోపల కూర్చున్న పాము కనిపించింది. అది పడగవిప్పి అతనిని భయపెట్టింది. పడగవిప్పి నిలబడి, అతనిపైకి పదే పదే నాలుక బయటకు పెడుతూ కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బెదిరిస్తోంది. దాంతో కంగురుపడ్డ అతను వెంటనే స్నాక్ క్యాచర్, రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ 5 అడుగులకు పైగా పొడవున్న నాగుపామును వాషింగ్ మెషీన్ లోంచి బయటకు తీశారు. దాన్ని సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలాడు. కాగా, ఇంటర్నెట్లో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.