భారత రెజ్లింగ్ సంఘంపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భర్త సోమ్వీర్ రాథీ తీవ్ర ఆరోపణలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అనర్హత వేటుకు గురైన వినేష్ ఫోగట్ కు డబ్ల్యూఎఫ్ఐ మద్దతుగా నిలవలేదని విమర్శించారు.వినేశ్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటుందా? అనే ప్రశ్నకు సోమ్వీర్ సమాధానం ఇవ్వలేదు. పారిస్ నుంచి వినేశ్ ఫొగాట్ భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.అభిమానుల నుంచి వచ్చిన అపూర్వ ప్రేమకు సోమ్వీర్ ధన్యవాదాలు తెలిపారు. ”దేశం మొత్తం వినేష్ ఫోగట్ పై అభిమానం కురిపిస్తోంది. ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఇలా తనను చూడటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు.
వినేష్ ఫోగట్ కు సహచర రెజ్లర్లూ పెద్ద ఎత్తున అండగా నిలిచారు. మేం భారత్లోకి అడుగు పెట్టేవరకూ ఇలాంటి సంబరాలు అస్సలు ఊహించలేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. పతకం కాస్తలో చేజారింది.మేమంతా బాధలో ఉన్నాం.కోర్టు లో తీర్పు మనకు అనుకూలంగా రాలేదు. ఇలాంటప్పుడు ఫెడరేషన్ మాకు మద్దతుగా లేదు. అథ్లెట్లకు మద్దతుగా లేకపోతే ఎలా ప్రదర్శన చేయగలరు?” అని సోమ్వీర్ వ్యాఖ్యానించారు.