సంచలన విషయాలు వెల్లడించిన వినేష్ ఫోగట్ కోచ్…

"Vinesh Phogat speaking at a press conference, expressing emotions while discussing revelations about her coach and issues in the wrestling community."

ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో టీమిండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఎక్కువ బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన విషయం మనకు తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగి, అద్భుతమైన తనదైన ఆటతీరుతో ఫైనల్ కు చేరుకుంది.అయితే కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న కారణంతో ఆమెపై ఒలింపిక్ నిర్వాహకులు వేటు వేశారు. కాగా,తాజాగా వినేశ్ పర్సనల్ కోచ్ వోలర్ అకోస్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. వినేశ్ బరువు తగ్గించే క్రమంలో ఆమె చనిపోతుందేమో అని భయపడ్డాం అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఉన్నట్లు గుర్తించాం. ఒక గంటా ఇరవై నిమిషాల వర్కౌట్ తర్వాత కూడా కిలోన్నర బరువు ఎక్కువగా ఉంది. దాంతో మరో 50 నిమిషాల వ్యాయామం చేపించాం. 50 కేజీలకు రావడమే టార్గెట్ గా అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున 5:30 గంటల వరకు వర్కౌట్స్ చేయించాం. కేవలం రెండు, మూడు నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ ఇలా చేశాం. దాంతో ఆమె కుప్పకూలి పోయింది. ఈ సమయంలో ఆమె చనిపోతుందేమో అని భయపడ్డాం’ అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు పర్సనల్ కోచ్ వోలర్ అకోస్.

Leave a Reply