ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) పాల్గొని స్వదేశానికి చేరుకున్న వినేశ్ ఫొగాట్ అస్వస్థతకు గురిఅయింది.పారిస్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఆమెకు ఘనస్వాగతం లభించింది.అక్కడి నుంచి తన స్వగ్రామం హరియాణాలోని బలాలికి పది గంటలపాటు ప్రయాణించి చేరుకుంది. స్థానికులు ఆమెకు భారీగా లడ్డూలను బహుమతిగా అందజేశారు. ఈసందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అయితే, ఎక్కువ ప్రయాణంతో తీవ్రంగా అలసిపోయిన వినేశ్.. సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురైంది. కాసేపు కుర్చీలోనే ఉండిపోయింది.
దీంతో అందరూ కంగారుపడ్డారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.వినేశ్ ఫొగాట్ పక్కనే ఆమె పెదనాన్నమహవీర్ ఫొగాట్, రెజ్లర్ బజరంగ్ పునియా తదితరులు ఉన్నారు. కొద్దిసేపటికి వాటర్ తాగిన తర్వాత వినేశ్ కాస్త తేరుకున్నట్లు కనిపించింది. ”ఎక్కువ సమయం ప్రయాణించడం, షెడ్యూలింగ్ కారణంగా ఆమె కాస్త ఇబ్బంది పడింది. స్వగ్రామంలో వినేశ్‌కు అద్భుతమైన స్వాగతం లభించింది” అని రెజ్లర్ బజరంగ్ పునియా వెల్లడించాడు.