శ్రావణ మాసంలో కనికరించని వరలక్ష్మి … ! మరోసారి మహిళలకి షాక్ ఇస్తూ బంగారం ధరలు!

Varalakshmi who is not merciful in the month of Shravana...! Once again shocking women gold prices!

కేంద్రం 2024-25 బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గింపుతో ఒక్కసారిగా గోల్డ్ ధరలు భారీగా తగుముఖం జరిగింది . అంతకు ముందు అధిక ధరల కారణంగా పసిడి కొనేందుకు, దానిపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆలోచించిన వారు మళ్లీ కొనుగోళ్ల బాటపట్టారు. బడ్జెట్ అనంతరం ఏకంగా ఐదు వేలకు పైగానే గోల్డ్ ధరలు దిగివచ్చాయి. దీంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇది మూడు రోజుల మురిపెంగానే మిగిలిపోయింది. మళ్లీ బంగారం, వెడి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గిన బంగారం వెండి ధరల్లో ఇంతలోనే అంత మార్పు కనిపిస్తుంది. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

Varalakshmi who is not merciful in the month of Shravana...! Once again shocking women gold prices!

శ్రావణ మాసం ప్రారంభం అవడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బంగారం కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో గోల్డ్ షాపులు కస్టమర్ల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసంలో వినియోగదారుల నుండి కొనుగోళ్లు అధికంగా ఉంటాయి కాబట్టి.. ఇప్పట్లో ఈ ధరల పెరుగుదల.. తగ్గడం అసాధ్యంలా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గగా నేడు మళ్లీ పెరిగాయి.

 

నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల తులం బంగారంపై 10 రూపాయలు  భారీగాపెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,660కు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.71,630 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, చెన్నై, ముంబయిలో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,780కి వద్ద అమ్ముడవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,810కు ట్రేడ్ అవుతుంది.

Leave a Reply