హీరో కిరణ్ అబ్బవరం – హీరోయిన్ రహస్య గోరక్ పెళ్లి పనులు షురూ అయ్యాయి. మొదటి సినిమాతో పరిచయమైనా వీరిద్దరూ ఐదేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు.రేపు ఆగస్టు 22న కర్ణాటక కూర్గ్ లో కిరణ్ – రహస్య పెళ్లి జరగబోతుందని సమాచారం అందుతుంది.ఇప్పటికే పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
తాజాగా రహస్యని పెళ్లికూతురిగా, పెళ్లి కొడుకుగా కిరణ్ అబ్బవరంని తయారుచేసారు. ఈ ఫోటోలను రహస్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే జరగనున్నట్టు ఓ వార్త హల్చల్ చేస్తుంది.ఆ తర్వాత హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖుల్ని పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. రేపు జరగబోయే వీరి పెళ్లి, పెళ్లి ఫోటోల కోసం కిరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.