వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బుధుడు 2025 మార్చి నెలలో మీనరాశిలోకి వెళ్తున్నాడు. మీనరాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది. బుధుడు కమ్యూనికేషన్ మరియు అనుకూలతలకు, వ్యాపార చతురతకు పేరెన్నిక గన్న గ్రహం. బుధుడి సంచారంతో నీచభంగ రాజయోగం బుధుడు మిధునరాశిని, కన్యారాశిని పాలిస్తాడు. బుధ సంచారం వ్యక్తుల యొక్క మేధస్సును, కమ్యూనికేషన్ ను, నిర్ణయాత్మక సామర్ధ్యాలను ప్రభావితం ఉంటుంది. అటువంటి బుధుడు మార్చి నెలలో మీనరాశిలో సంచరించే వేళ ఏర్పడుతున్న నీచ భంగ రాజయోగంతో అదృష్ట జాతకులుగా మారిన రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం..
మేష రాశి: నీచభంగ రాజయోగం కారణంగా మేషరాశి వారికి మంచి జరుగుతుంది. మేషరాశిలో 12వ ఇంట్లో బుధ సంచారం జరుగుతుంది. దీని కారణంగా మేష రాశి జాతకుల ఆదాయ స్థాయిలు గణనీయంగా మెరుగుపడతాయి. మేషరాశి వారు వృత్తి వ్యాపారాలలో లాభలను సాధిస్తారు.వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, బెట్టింగ్లు, లాటరీల నుంచి ప్రయోజనాలు పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
వృషభరాశి: నీచభంగ రాజయోగం కారణంగా వృషభరాశి వారికి అన్నీ శుభాలే జరుగుతాయి. వృషభ రాశిలో ఈ యోగం 11వ ఇంట్లో ఏర్పడుతుంది.వృషభ రాశి వారి కెరీర్ పురోగతి సాధిస్తుంది. వ్యాపారాలను విస్తరించడానికి ఇది సరైన సమయం. వృషభ రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో నిలకడగా ఉంటుంది. కాబట్టి ఇది భారీ ధనలాభాలను మెరుగుపడాయి. ఈ సమయంలో నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి .
మీనరాశి: నీచభంగ రాజయోగం కారణంగా మీన రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. మీనరాశిలో లగ్న గృహంలో నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల మీన రాశి వారి వ్యక్తిత్వం ఈ సమయంలో మెరుగుపడుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వివిధ ఒప్పందాల నుండి లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. మీన రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది. వృత్తి జీవితంలో పెద్ద విజయాలను సాధించే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు లాభాలను ఇస్తాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.
గమనిక: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.