ఈ రాశులవారి మాటే శాసనం….ఈ ఏడాది మట్టి పట్టినా బంగారం!

ఈ రాశులవారి మాటే శాసనం....ఈ ఏడాది మట్టి పట్టినా బంగారం!

 

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ఉండే ప్రాధాన్యత అందరికి తెలిసిందే. సూర్య భగవానుడు ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా సూర్యుడు రాశి మారడాన్ని రాశి సంక్రమణం అంటారు. ప్రస్తుతం సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నాడు. ధనుస్సు రాశిలో ఉన్న సూర్యుడు జనవరి 14వ తేదీన మకర రాశిలోకి చేరుతాడు.

మకర రాశి మకర రాశిలో మకర సంక్రాంతి రోజున సూర్యసంచారం మకర రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్ఫుచెందడు. మకర రాశి వారి కష్టాలు ఈ సమయంలో తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగాను మకర రాశి వారికి ఇది చాలా బాగుంటుంది.మకర రాశి జాతకులు అన్ని పనులలో విజయం సాధిస్తారు.

కుంభరాశి కుంభ రాశి వారికి మకర సంక్రాంతి రోజున సూర్యసంచారం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులలో అడుగుపెట్టే వారికి విజయం వరిస్తుంది. వ్యాపారంలో గతంలో కంటే ఆర్థికంగా బలోపేతం అవుతారు.

సింహరాశి మకర రాశిలో సూర్య సంచారం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని కలిగి ఉంది. సింహ రాశి వారు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా పుంజుకుంటారు. పెట్టిన పెట్టుబడుల నుండి రాబడి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు మానసికంగా హ్యాపీ గా ఉంటారు.

తులారాశి మకర సంక్రాంతి తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. తులారాశి జాతకులకు ఇప్పటినుంచి రాజయోగం ప్రారంభమవుతుంది. సంక్రాంతి రోజున సూర్య సంచారం కారణంగా తులా రాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.

గమనిక : ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Leave a Reply