Image default
Political News

రుషికొండ నిర్మాణాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గుర్ల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం విమానాశ్రయానికి వస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రుషికొండపై గత ప్రభుత్వం రాజ భవంతుల తరహాలో చేసిన నిర్మాణాలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.600 కోట్లను ఖర్చు చేసి మరీ నిర్మించిన ఈ భవనాలు ఎన్నికల ముందు ఎవరూ చూడటానికి కూడా అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. ఎన్నికల ముందు విశాఖపట్నం పర్యటనలో పలుమార్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రుషికొండ ప్యాలెస్ గురించి ప్రస్తావించారు.
అటుగా వస్తున్న ఉప ముఖ్యమంత్రివర్యులు ప్యాలెస్ ను ఒకసారి పరిశీలించాలని భావించి లోపలకు వెళ్లారు. 7 అతి పెద్ద భవనాలు, వీటిలోని మూడు ఇళ్లను నిర్మించిన తీరును ఎంపీ శ్రీ ఎం.భరత్ గారు ఉప ముఖ్యమంత్రివర్యులకి వివరించారు. ప్యాలెస్ పరిసరాలను, సీ వ్యూ పాయింట్ ను బయట నుంచే చూసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పని చేస్తున్న సిబ్బందితో మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు.

భవనాల ఎత్తు, వాటి విస్తీర్ణం,వాటి మార్కెట్ ధర వంటి విషయాలను, అలాగే న్యాయ పరమైన అంశాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యలమంచిలి ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, విశాఖ కార్పొరేటర్ శ్రీ పి.మూర్తి యాదవ్ గారు వివరించారు. సుమారు 30 నిమిషాల పాటు రుషికొండ ప్యాలెస్ పరిసరాలను పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి విమానాశ్రయానికి బయలుదేరారు.
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Subscribe on YouTube Subscribe Now

Related posts

ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్..

Suchitra Enugula

Vijay Sai Reddy Quit From Politics – రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై

Suchitra Enugula

చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో ఏం చేయబోతున్నారు?

Suchitra Enugula

Leave a Comment