బీహార్ లో ఓ బ్రిడ్జి నిర్మాణం తొమ్మిదేళ్లుగా జరుగుతుంది . రూ.1717 కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ ఇప్పటికే రెండు సార్లు కూలిపోగా.. తాజాగా శనివారం మరోసారి కూలిపోయింది. వంతెనలోని ఓ భాగం శనివారం కూలిపోయి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిర్మాణంలో ఉండగానే ఇన్నిసార్లు కూలిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యాక ఎన్నిరోజులు నిలుస్తుందనే సందేహాలు వస్తున్నాయి ప్రజలకు.
బీహార్ లో ఓ బ్రిడ్జి నిర్మాణం తొమ్మిదేళ్లుగా జరుగుతుంది ఉంది. రూ.1717 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ ఇప్పటికే రెండు సార్లు కూలిపోగా.. తాజాగా శనివారం మరోసారి కూలిపోయింది. వంతెనలోని ఓ భాగం శనివారం కూలిపోయి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిర్మాణంలో ఉండగానే ఇన్నిసార్లు కూలిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యాక ఎన్నిరోజులు నిలుస్తుందనే సందేహాలు వస్తున్నాయి ప్రజలకు . రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్ గంజ్ – అగువాని గంగా నది రూట్ లో ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. 2014, ఫిబ్రవరి 23న భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్ – ఖగారియా జిల్లాలోని అగువానీ ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 మార్చి 9న నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఇది భాగల్‌పూర్ నుంచి ఖగారియా మీదుగా జార్ఖండ్‌కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. 2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు