రుణమాఫీ పై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్

State government waived farm loans up to Rs 2 lakhs within eight months after coming to power.

రుణమాఫీకి అన్ని అర్హతలు ఉండి రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు కొత్త ప్లాన్ అమలుపరుస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆధార్‌ కార్డుల్లో తప్పులుండటం, బ్యాంకు ఆధార్‌ వివరాల్లో తేడాలుండటం, పట్టాదారు పాస్‌ పుస్తకం లేకపోవటం లాంటి కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ అమలు కాలేదు.దీంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి శుభవార్త చెబుతూ మీకు టెన్షన్ అవసరం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగితీరుతుందని చెప్పారు. ఈ మేరకు గత జూలై 15న జారీచేసిన జీవో నంబరు 567కు అనుబంధంగా రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం ఓ నివేదిక జారీ చేసింది. రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని పేర్కొంది.

ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపి ఆదేశాలను జారీ చేశారు. ఏవోలు రైతుల ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలని, రుణమాఫీ అమలుకాని రైతులపై శ్రద్ద పెట్టి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పారు. ఆధార్‌ కార్డు తప్పుగా ఉంటే.. రైతుల వద్దకు వెళ్లి ఆధార్‌ కాపీ మళ్లీ తీసుకోవాలని, అదేవిధంగా ఓటరు కార్డు, వాహన లైసెన్సు, రైతు రేషన్‌ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను రైతుల నుంచి తీసుకొని పోర్టల్ లో సబ్మిట్ చేయాలని తెలిపారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగొద్దని అన్నారు. ఈ స్టేట్‌మెంట్‌తో రుణమాఫీ కాని రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Reply