నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం….

"Telangana government announces positive initiatives for the unemployed, offering new opportunities and support."

నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. తెలంగాణలో 10,954 గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థను తిరిగి మల్లి పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ లుగా పని చేసిన వారిని ఈ వ్యవస్థలో భాగం చేయాలని, ఇందుకోసం వారికి పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రద్దు అయిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. అందుబాటులో ఉండే గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ సహాయక అధికారులుగా పని చేసిన వారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అభ్యర్థులు లేని సమయంలో కొత్త నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

Telangana:నిరుద్యోగులకు గుడ్ న్యూస్..భారీ సంఖ్యలో VRO నోటిఫికేషన్?

ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించగా మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది.VRO, VRAలకు పరీక్ష నిర్విహించి అందులో మెరిట్ సాధించిన వారికి అవకాశం కల్పిస్తారు. ఇందులో ఉద్యోగాలు మిగిలితే వాటిని కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. VRO, VRAలకు తప్పనిసరిగా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత వుండే వారు మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులుగా సూచించారు. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 వయసు గల వారు అర్హులు. అయితే ప్రజెంట్ ఈ TS VRO నోటిఫికేషన్ 2024 ఇంకా విడుదల కాలేదు.

Leave a Reply