ఆ విషయం చెప్పబోతున్న సుడిగాలి సుధీర్ – రష్మి?

Sudhir Sudheer - Rashmi who is going to say that?

సుడిగాలి సుధీర్ – రష్మీ గౌతమ్ జంటకు బుల్లితెరపై స్టార్ హీరో, హీరోయిన్లకుండే విదం లో పేరుంది. ఈ జంట కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. వీరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలుకానీ, ఇతరత్రా సన్నివేశాలుకానీ, కార్యక్రమంలో భాగంగా జరిగిన పెళ్లికానీ.. ఇలా వీరిని స్టార్ కపుల్ ను చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరికీ లక్షల సంఖ్యలో అభిమానులు చాలా ఉన్నారు. వీరిద్దరూ ఎప్పటికైనా పెళ్లిచేసుకోబోతారా? అని ఆశగా ఎదురుచూసే అభిమానులు ఎంతోమంది. వారి కోరిక మాత్రం తీరడంలేదు. రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అందుకు కారణం.. సుధీర్ సినిమాల్లోకి వెళ్లడం అని తెలుస్తుంది.

Sudhir Sudheer - Rashmi who is going to say that?
 

సినిమాలు తీసిన తర్వాత, మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. దీంతో బెల్లితెరపైకి మళ్లీ సుధీర్ వచ్చేశాడు అని తెలుస్తుంది. ఈటీవీ, మాటీవీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈనెల 14వ తేదీన ఈటీవీలో సంక్రాంతికి వస్తున్నాం పేరుతో కార్యక్రమం వస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్ – రష్మి జంట మరోసారి మెరిసింది. ఇద్దరూ రొమాంటికి సన్నివేశాలతో ఆకట్టుకోబోతున్నారని ఇది చూస్తే అర్థమవుతోంది.

అంతేకాదు.. హైపర్ ఆది పుష్ప2 స్పూఫ్ చేశాడు. అంతేకాదు.. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా 14వ తేదీన విడుదల కాబోతోంది.ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తదితరులు హాజరు కాబోతున్నారు. పూర్ణ ప్రత్యేక అతిథిగా మెరవబోతున్నారు. ఈ కార్యక్రమంలో తండేల్ సినిమాలోని బుజ్జితల్లి పాటకు సుధీర్, రష్మి డ్యాన్స్ చేశారు. వింటేజ్ లో వీరిద్దరూ ఎలా ఉండేవారే అలా చూపించారు. ఇద్దరూ పోటీపడుతూ రొమాంటిక్ సన్నివేశాలు చేశారు. అభిమానులు కూడా ఇదేకదా వారిద్దరి నుంచి మాకు కావల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనపపటికీ మరోసారి ఈ జంట ఈటీవీ వేదికగా మెరవబోతున్నారు. వారి కోరిక నెరవేరుతుందా? లేదా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. అయితే 14వ తేదీన వారి నుంచి ఎటువంటి ప్రకటన వచ్చే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. అదేరోజు ఏమైనా విషయం చెబుతారేమోనని కొందరు నెటిజన్ల సోషల్ మీడియాలో చర్చ పెట్టారు. అయితే వీరిద్దరూ గతంలోనే తామిద్దరం కేవలం కార్యక్రమాల కోసమే అలా నటిస్తున్నామని, తామిద్దరం కేలం స్నేహితులమేనని, అటువంటిదేమీ లేదని చెబుతున్నప్పటికీ అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply