తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరంటే అందరు ఠక్కున శ్రీలీల పేరునే చెబుతారు. గత రెండు సంవత్సరాల్లో ఆమె నటించిన సినిమాలే దీనికి కారణం. గత రెండేళ్లలో ఆమె నటించిన సినిమాలు గ్యాప్ లేకుండా బాక్సాఫీస్‌పై దాడి చేశాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు.
పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో చేసింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ.
అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో తెలుగులో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. దీంతో శ్రీలీల ఆఫర్ల కోసం కొత్త దారిని వెతుకుతోన్నట్టు కనిపిస్తోంది. బ్లాక్ కలర్ శారీ, డిజైన్ చేయించిన బ్లౌజ్‌తో శ్రీలీల దర్శనం ఇచ్చింది. ఈ శారీలో తళుక్కుమని పిచ్చిఎక్కిస్తోంది. ఇటీవల గ్లామర్ ట్రీట్‌తో అదరగొడుతోంది. తాజాగా ఈ భామ తన అందాలను అరబోసిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చూసింది.