లెమన్ వాటర్ : ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
నిమ్మకాయలలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. వీటికి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే నిమ్మరసంలోని విటమిన్ సి, శక్తివంతమైనన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో కణాలకు నష్టం చేసే ఫ్రీ రాడికల్స్‌తో యాంటీఆక్సిడెంట్లు పోరాడతాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తాయి. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగితే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ తొలగుతాయి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.నిమ్మకాయలు, ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. అదనంగా, విటమిన్ సి మీ శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి, ఐరన్ శోషణ, కొల్లాజెన్ సంశ్లేషణలో హెల్ప్ చేస్తుంది . నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది .