ప్రధాని మోడీని బీట్ చేసిన శ్రద్ధాకపూర్..!

Shraddha Kapoor beat Prime Minister Modi..!

భారత ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా మోడీ ఎక్కడికీ వెళ్లినా ఆయనను చూసేందుకు అభిమానులు భారీగానే తరలివస్తుంటారు.అలాంటిది ఇప్పుడు ప్రధాని మోడీని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ దాటేసింది.

Shraddha Kapoor ignores her ill-health and heads to Lucknow to fulfil a  professional commitment - The Statesman

ప్రస్తుతం మన దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది విరాట్ కోహ్లికే. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కోహ్లీ తర్వాత ప్రియాంక చోప్రాకు 91.8 మిలియన్లు, ప్రధాని మోదీకి దాదాపు 91.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మూడో స్థానికి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వచ్చేసింది. స్త్రీ 2′ సక్సెస్ తో ఈమె ఫాలోవర్స్ సంఖ్య 91.4 మిలియన్లకు చేరింది. దీంతో ఈమె మోడీని సోషల్ మీడియా ప్లాట్ఫారం అయిన ఇన్ స్టాలో బీట్ చేసింది. ట్విటర్లో మాత్రం 101.2 మిలియన్ల ఫాలోవర్లతో మోడీ తొలి స్థానంలో ఉండటం విశేషం. ఇక శ్రద్ధా కపూర్ విషయానికొస్తే.. చాలా రోజుల నుంచి హిందీలో సినిమాలు చేస్తూ వస్తోంది. స్త్రీ 2 మంచి సక్సెస్ సాధించడంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.

Leave a Reply