టెన్నిస్ లో కొన్ని సంవత్సరాలపాటు స్టార్ ప్లేయర్ గా కొనసాగిన సానియా మీర్జా 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రిసెప్షన్ హైదరాబాద్ లో జరగ్గా, వివాహం పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో జరిగింది. 2018లో ఈ జంటకు ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. తర్వాత సానిమాకు, షోయబ్ కు విభేదాలు రావడంతో 2020లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొడుకుతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటుంది. షోయబ్ మాలిక్ ప్రవర్తన నచ్చకే సానియా అతనికి విడాకులిచ్చిందని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా తెలిపారు
భార్యకు విడాకులిచ్చిన షమీ ఆ తర్వాత కొన్నాళ్లు మౌనంగానే ఉన్న సానియాపై తర్వాత రకరకాల వార్తలు వచ్చాయి. ఇండియన్ క్రికెట్ మహ్మద్ షమీని పెళ్లిచేసుకోబోతందనేది ఆ వార్తల సారాంశం. అయితే దీన్ని ఇరువైపులా ఎవరూ ఖండించకపోవడంతో నిజమే అని అందరూ అనుకున్నారు. షమీ తన భార్య జహాన్ కు విడాకులిచ్చిన విషయం తెలిసిందే. రెండో పెళ్లి చేసుకోవాలంటూ ఎంతోమంది సానియాకు హితవు పలికారు. షోయబ్ పాకిస్తాన్ నటి సనా జావిద్ ను మూడో పెళ్లి చేసుకున్నారు. సనాకు ఇది రెండోపెళ్లి.
తాజాగా తెలుగులో ఓ స్టార్ హీరోతో సానియామీర్జా డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయిఈమధ్య కాలంలో . అయితే సానియా మీర్జా మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. అలాగే ఖండించనూ లేదు. ఇప్పుడు ఆ తెలుగు స్టార్ హీరో ఎవరు అనే చర్చ నడుస్తోంది. ఇటీవలే సానియా మీర్జా కొత్త జీవితం ప్రారంభించాలంటూ పోస్ట్ చేసింది. దీంతో రెండో పెళ్లికి సానియా సిద్ధమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.పాకిస్తాన్ కు చెందిన నటుడు నబీల్ జాఫర్ సానియా రెండో పెళ్లి చేసుకోవాలంటూ బహిరంగంగానే సూచించారు.
హిందువు, ముస్లిం అని తేడా లేకుండా మంచి వ్యక్తిని చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. అయితే తెలుగులో కొందరు యువ హీరోలు ఉన్నారు. మిగతావారికి వివాహాలయ్యాయి. వివాహమై విడిపోయిన హీరోతో డేటింగ్ లో ఉందా? వివాహం చేసుకున్న హీరోతే డేటింగ్ లో ఉందా? పెళ్లికాని హీరోతో డేటింగ్ లో ఉందా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అసలు ఈ వార్తలు నిజం ఎంత అనేది సానియా స్పందించిన తర్వాతే తెలుస్తుంది.