స్టార్ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..! మళ్లీ ప్రేమలో పడిందా..?

Samantha reportedly dating a star director, suggesting she may have fallen in love again, sparking interest and curiosity among fans."

స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు  ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలిన సమంత తమిళ్‌లోనూ తన సత్తా చాటింది.ఏ మాయచేశావే తో హీరోయిన్ గా పరిచయమైన సామ్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే సమంత అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది.

అయితే ఎవ్వరు ఊహించని విధంగా ఈ ఇద్దరూ విడిపోతున్నాం అని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. ఆతర్వాత సమంత మాయోసైటిస్ వ్యాధిని బారినపడింది. దాంతో ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. ఇక ఇప్పుడు మెంటల్‌గా, శారీరకంగా స్ట్రాంగ్‌గా అయ్యేందుకు ఏడాది పాటు సినిమాలకు  దూరం అయ్యింది.

త్వరలోనే సమంత తిరిగి తన సినిమాలతో బిజీ కానుంది. తెలుగు, తమిళ్ లతో పాటు హిందీలోనూ లు చేస్తోంది. హిందీలో వెబ్ సిరీస్‌లు చేస్తోంది. ఇప్పటికే హిందీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చేసింది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సమంత మాజీ భర్త నాగ చైతన్య రీసెంట్‌గా శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. చైతూ, శోభితాను ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో,ఇప్పుడు అందరి దృష్టి సమంత పై పడింది.

అయితే సామ్ గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది. సామ్ ఓ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉందంటూ ఓ రూమర్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో సామ్ డేటింగ్‌లో ఉంది అంటూ రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. రాజ్ డీకే నిర్మించిన ఫ్యామిలీ మాన్ 2లో సామ్ నటించింది. ఇప్పుడు సమంతతో మరో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు రాజ్ డీకే. ఈ నేపథ్యంలో రాజ్‌తో సమంత డేటింగ్‌లో ఉందంటూ ఓ పుకారు ఇప్పుడు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

రెండు వెబ్‌ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి పుకార్లు వస్తున్నాయంటూ సామ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లైంది. ఆయన ఇప్పుడు తన భార్యతో విడిపోయే ఆలోచనలో ఉన్నారని కూడా వినిపిస్తుంది. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply