రుహాని శర్మ ‘చి ల సౌ’ అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో ఈమె ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిగా చాలా సింపుల్ గా,సహజంగా కనిపించింది.తల్లి మానసిక పరిస్థితి కారణంగా పెళ్లి కాకుండా ఇబ్బంది పడే నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిగా రుహాని నటన ఆ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ‘చి ల సౌ’ చూసిన వాళ్ళు అందులో రుహాని శర్మ అమాయకపు లుక్స్ ని, ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అయిపోయారు.కానీ ‘ఆ ఇమేజ్ దగ్గరే స్టిక్ అయిపోకూడదు’ అని భావించో ఏమో కానీ.. తర్వాత ‘హిట్’ వంటి కొన్ని సినిమాల్లో ఆమె మోడ్రన్ గా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ‘చి ల సౌ’ సినిమాలో మాదిరి రుహాని శర్మని అంత నేచురల్ గా ఏ దర్శకుడు ప్రెజెంట్ చేయలేదు. సో రుహాని మిస్టేక్ లేనట్టే..! ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే..! రుహాని శర్మకి సంబంధించిన కొన్ని బెడ్ రూమ్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
‘ఆగ్ర’ అనే సినిమాకు సంబంధించిన సీన్స్ అవి. రుహాని శర్మ.. ఎన్నడూ లేని విధంగా ఆ సినిమాలో లవ్ మేకింగ్ సీన్స్ లో నటించడంతో.. ఆ వీడియోలు చూసిన వారంతా షాక్ కి గురవుతున్నారు. ‘ఆమె ఎందుకు ఇలాంటి బోల్డ్ స్టెప్ తీసుకుందా?’ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి రుహాని శర్మ థియేటర్ ఆర్టిస్ట్. ఆమె నటన బాగుంటుంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్థురాలు. అయినా సరే ఇలాంటి బోల్డ్ రోల్స్ పై ఆధారపడాల్సి వచ్చింది అంటే..టాలీవుడ్ దర్శకుల తప్పు కూడా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.