బాలీవుడ్ పై మండిపడ్డ రిషబ్ శెట్టి..

Rishabh Shetty angry with Bollywood..

బాలీవుడ్ సినిమాలకు , సౌత్ ఇండియన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో చాలా మంది దీనిపై కామెంట్స్ కూడా చేశారు. సౌత్ వర్సెస్ నార్త్ చాలా కాలం క్రితమే జరిగింది. రీసెంట్ గా కల్కి పై బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది.ఆ బాలీవుడ్ నటుడికి కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ల పై కాంతార హీరో నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రిషబ్ శెట్టి ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రమోద్ శెట్టి కథానాయకుడిగా రిషబ్ శెట్టి నిర్మించిన ‘లాఫింగ్ బుద్ధా’ చిత్రం ఈ వారం విడుదలవుతోంది. ఈ ప్రమోషన్ కోసం రిషబ్ పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

తాజాగా రిషబ్ శెట్టి జాతీయ అవార్డు అందుకున్నాడు. ‘కాంతార’ లో నటనకు గానూ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. రిషబ్ సాధించిన ఘనత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రిషబ్ బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు.

Rishab Shetty: బాలీవుడ్ పై మండిపడ్డ రిషబ్ శెట్టి.. ఇండియాను చెడుగా చూపిస్తున్నారంటూ..

కొన్ని సినిమాలు,ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారతదేశాన్ని చెడుగా చూపిస్తున్నాయి. ఆర్ట్ ఫిల్మ్‌లుగా ప్రచారం చేయబడి, గ్లోబల్ ఈవెంట్, రెడ్ కార్పెట్‌లకు ఆహ్వానం అందుతుంది. నా దేశం.. నా గర్వం, నా రాష్ట్రం.. నా గర్వం, నా భాష.. నా గర్వం. మన దగ్గర ఉన్నదాన్ని సానుకూలంగా చూపించడం లేదు’ అని ఆయన అన్నారు. రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారింది. రిషబ్ కామెంట్స్‌కు కొందరు మద్దతు తెలుపుతున్నారు. రిషబ్ శెట్టి సరైన రీతిలో మాట్లాడాడని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి కూడా నటన, దర్శకత్వం అలాగే నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కొత్త హీరోల తో సినిమాలు నిర్మిస్తున్నాడు. రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతార: చాప్టర్ 1’తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply