పేసేంట్లు సంఖ్య పెరగడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి వచ్చింది. కనీసం ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు స్టాండ్స్ కూడా లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కిటికీలకు కట్టి రోగులకు సెలైన్ బాటిల్స్ పెడుతున్నారు. జ్వరం వస్తే తగ్గడం లేదని.. ప్లేట్‌లెట్స్ తగ్గుతుండడంతో ఆందోళనకు గురవుతున్నామన్నారు రోగులు. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నామని ఆవేదన తెలుపుతున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో డెంగ్యూ దడ పట్టిస్తోంది. వైరల్ ఫీవర్స్ విజృంభిస్తుండడంతో కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధానంగా.. ఉమ్మడి కరీంనగర్ జిలాల్లో 15 రోజులుగా డెంగ్యూ వణుకు పుట్టిస్తోంది. ఏజెన్సీలోనే కాదు.. మైదాన ప్రాంతాల్లోనూ వైరల్ ఫీవర్స్ భయపెడుతున్నాయి. డెంగ్యూ వేగంగా విస్తరిస్తుండడంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ, ఐపీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా.. కరీంనగర్ జిల్లాలో 15 రోజుల్లోనే డెంగ్యూ కేసులు అమాంతం పెరగడంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు. అటు..కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు సరిపడ బెడ్లు, సెలైన్ బాటిల్స్ ఎక్కించేందుకు స్టాండ్ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు.
ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆస్పత్రిబారిన పడుతున్నారు. అంతేకాదు.. వైరల్ ఫీవర్ కారణంగా కొద్దిరోజుల్లోనే ప్లేట్ లెట్స్ దారుణంగా పడిపోతున్నాయి. దాంతో.. ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. నాలుగు, ఐదు రోజుల వరకు ఆస్పత్రుల్లోనే మకాం వేస్తున్నారు. అటు.. చిన్నారులు అయితే వైరల్ ఫీవర్స్‌తో అల్లాడిపోతున్నారు. వైరల్ ఫీవర్స్ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. జ్వరాలు పీడిస్తు్న్న గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ టెస్టులు నిర్వహిస్తున్నారు. పరిస్థితులు చేయిదాటకుండా.. జ్వరం ఎక్కువగా ఉన్నవారిని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆస్పత్రులకు పంపుతున్నారు.
మరోవైపు.. రోగులు సంఖ్య పెరగడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది. కనీసం ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు స్టాండ్స్ కూడా లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కిటికీలకు కట్టి రోగులకు సెలైన్ బాటిల్స్ పెడుతున్నారు. జ్వరం వస్తే తగ్గడం లేదని.. ప్లేట్‌లెట్స్ తగ్గుతుండడంతో ఆందోళనకు గురవుతున్నామన్నారు రోగులు. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.