ఈ మధ్యకాలంలో టాప్-5 హిట్స్ వదులకున్న బాలయ్య….

టాప్-5 హిట్స్ వదులకున్న బాలయ్య....

 

తెలుగు సినీ పరిశ్రమలో ఉండే రచయితలు, దర్శకులు ఒక కథను తయారు చేసుకునేటప్పుడు అనేక అంశాలను వారు దృష్టిలో పెట్టుకుంటారు. ఆ కథ ఏ హీరోకు సెట్ అవుతుంది ? అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో పరిశీలించుకొని అందుకు అనుగుణంగా కథ ఉంటుంది. చివరకు కథ మొత్తం సిద్ధమైన తర్వాత రచయిత కానీ, దర్శకుడుకానీ హీరోను కలిసి కథను పూర్తిగా వినిపిస్తారు. అయితే సదరు హీరో కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, కథ నచ్చకపోవడం, మరికొన్ని ఇతర కారణాలవల్ల దాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. అలా తిరస్కరించిన కథలతో సదరు రచయిత, దర్శకుడు వేరే హీరోకు కథ చెప్పి, ఒప్పించి సినిమాలు చేస్తారు. అందులో ఓ ఐదు సినిమాలున్నాయి. అవేంటనేది పరిశీలిద్దాం. అలా చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు.

 

 

తమిళంలో పి.వాసు దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చంటి సినిమాను తెలుగలో బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ భావించారు. అయితే ఆ కథ బాలకృష్ణకు నచ్చకపోవడంతో వారు రాజశేఖర్ అనుకున్నారుకానీ అది కూడా కుదర్లేదు. చివరకు వెంకటేష్, మీనాతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేసిన తర్వాత రాజమౌళి బాలయ్యతో సింహాద్రి సినిమా చేద్దామనుకున్నారు. అయితే ఆ సమయానికి పలనాటి బ్రహ్మనాయుడు సినిమాను ఒప్పుకున్నారు. కొత్త దర్శకుడు కదా అని కాస్తంత నిర్లక్ష్యంతో ఓకే చెప్పలేదు. చివరకు జూనియర్ ఎన్టీఆర్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. పలనాటి బ్రహ్మనాయుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కి అట్టర్ ఫ్లాప్ అయింది.

 

 

నాగార్జున-విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన జానకిరాముడు సినిమా ముందుగా బాలయ్య వద్దకే వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేద్దామని ఆయన అనుకున్నారు. అయితే కోడి ఈ ప్రాజెక్టు నుంచి కొన్ని కారణాలవల్ల తప్పుకోవడంతో ఇది రాఘవేంద్రరావు దగ్గరకు చేరింది. కోడి రామకృష్ణ తప్పుకోవడంతో బాలయ్య కూడా తప్పుకున్నాడు. చివరకు రాఘవేంద్రరావు నాగార్జున-విజయశాంతితో తీసి భారీ హిట్ కొట్టారు. కరోనా సమయంలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. తర్వాత గోపీచంద్ దర్శకత్వంలో వీరసింహారెడ్డి చేసి బాలయ్య సూపర్ హిట్ కొట్టారు. దీంతోపాటు రాజశేఖర్ హీరోగా సముద్ర దర్శకత్వంలో వచ్చిన సింహరాశి సినిమా కూడా బాలయ్య చేయాల్సి ఉంది. రీమేక్ చేయడం ఇష్టంలేని బాలయ్య దాన్ని తిరస్కరించడంతో రాజశేఖర్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇటీవలే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన క్రాక్ కూడా బాలయ్యే చేయాల్సి ఉంది. అయితే సాధారణమైన యాక్షన్ సినిమాలానే ఉందని బాలయ్య వద్దన్నారు. రవితేజతో చేసి గోపీచంద్ సూపర్ హిట్ అందించారు.

Leave a Reply