మిడ్ నైట్ విశాఖ గంగవరం పోర్ట్‌లోకి పైథాన్ ఏంట్రీ ……. !!!

Python entry into Visakhapatnam Gangavaram port at midnight ....... !!!

కాదలలేని స్థితిలో భారీ కొండచిలువ కనిపించింది. ఎందుకంటే అప్పటికే పొట్ట నిండా ఏదో ఆహారం తిని తిష్ట వేసింది. కార్మికుల అలికిడి విని మెల్లగా పాకేందుకు ప్రయత్నిస్తోంది. దాన్ని తరిమే సాహసం చేయలేని కార్మికులు.. పాములు పట్టే నేర్పరి కిరణ్ కు సమాచారం తెలిపారు.

విశాఖ గంగవరం పోర్ట్.. కార్మికులంతా పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. పొద్దుపొయింది. కాస్త చీకటి పడింది. అంతలో ఓ కార్మికుడు గట్టిగా అరిశాడు. కేకలు పెడుతూ పరుగులు తీశాడు. అందరూ కంగారుపడ్డాడు. ఏమని అడిగితే భారీ కొండచిలువ అక్కడ ఉన్నట్టు చెప్పాడు. వెళ్లి చూస్తే.. కదలలేని స్థితిలో భారీ కొండచిలువ కనిపించింది. ఎందుకంటే అప్పటికే పొట్ట నిండా ఏదో ఆహారం తిని ఉంది. కార్మికుల అలికిడి విని మెల్లగా పాకేందుకు ప్రయత్నిస్తోంది. దాన్ని తరిమే సాహసం చేయలేని కార్మికులు.. పాములు పట్టే నేర్పరి కిరణ్ కు సమాచారం చేరవేసారు . రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కిరణ్.. పామును పట్టుకొని ప్రయత్నం చేశాడు. ఎదురు తిరుగుతున్నప్పటికీ ఆ పామును అత్యంత చాకచక్యంగా బంధించాడు కిరణ్. అనంతరం నిర్జన ప్రదేశంలో వదిలివేశాడు. దీంతో కార్మికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply