ఆర్టీసీ బస్సులో ప్రసవించిన గర్భిణీ…

A pregnant woman giving birth on a bus with the assistance of passengers and staff, followed by her and the newborn being transported to a hospital.

తెలంగాణ ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి తన మానవత్వం చాటుకున్నారు. గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సంధ్య సోమవారం ఉదయం గద్వాల డిపోకు చెందిన టీఎస్ 33 టి 2543 నెంబర్ గల ఆర్టీసీ బస్సులో గద్వాల్ నుండి వనపర్తి కి పల్లె వెలుగు బస్సు లో ప్రయాణిస్తుంది.వనపర్తి కి దాదాపు 15 కి.మీ దూరంలో నాసినపల్లి గ్రామ స్టేజ్ వద్ద గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ జి.భారతి అప్రమత్తమై డిపో మేనేజర్కు సమాచారం అందించారు. డీఎం సూచనల మేరకు ఒక నర్సు, మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ డెలివరీ చేశారు.

TSRTC | A TSRTC Express bus, built on an Eicher LPO 25.10 ch… | Flickr

ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం అనంతరం మెరుగైన వైద్యం కోసం వనపర్తి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ భారతీతో పాటు నర్సు, మహిళా ప్రయాణికులను ఆర్టీసి ప్రయాణికులు, అధికారులు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply