ప్రభాస్ బర్త్ డే.. ఫాన్స్ కి డబుల్ ధమాకా!

"Prabhas' birthday celebration with double the excitement for fans, featuring special surprises and thrilling updates."

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘రీ-రిలీజ్’ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల బర్త్ డే రోజున గతంలో వారు నటించిన సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.రీ-రిలీజ్‌లో కూడా కలెక్షన్లు బాగుండడంతో నిర్మాతలు కూడా వరుసగా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇటీవల ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ‘మురారి’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలను రీ-రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

అక్టోబర్‌ 23న మన డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా డార్లింగ్ నటించిన సినిమాలను రీ-రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. 2010లో రిలీజ్ అయి ప్రభాస్ కెరీర్‌ను మలుపుతిప్పిన ‘డార్లింగ్’ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలానే ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ కూడా రీ-రిలీజ్ కానుంది. 2002లో విడుదలైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. డార్లింగ్, ఈశ్వర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిసి ప్రభాస్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Bahubali actor prabhas celebrating his 42nd birthday, know interesting  facts about the actor | बर्थ-डे स्पेशल: प्रभास ने 19 साल के फिल्मी करियर  में 5 साल केवल 'बाहुबली' और 'बाहुबली 2': द

ఇటీవల ‘సలార్’, ‘కల్కి’ సినిమాలతో ప్రభాస్ భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో హీరోగా ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా కూడా లైన్లో ఉంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నాడు.

Leave a Reply