ఇటీవల ప్రకటించిన 70వ జాతీయ అవార్డు వేడుకల్లో నిత్యామీనన్ కి ఉత్తమ నటి అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ చిత్రం `తిరుచిత్రంబళం`లోని నిత్యామీనన్ నటనకుగానూ అవార్డు అందుకుం టున్నారు.అయితే ఈ సినిమాలో నిత్యామీనన్ నటనకు అవార్డు రావడం పట్ల కొంత వ్యతిరేకత వచ్చిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాలా మంది తమిళ ప్రేక్షకులు ఆమెకి ఉత్తమ నటి అవార్డు ఏంటి? అని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై నిత్యామీనన్ స్పందించింది.
`జాతీయ అవార్డు గెలుచుకునేంత స్థాయి ఈ సినిమాకి లేదని కొందరు చర్చలు జరుపుతున్నారు. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలుండవు. రొమాంటిక్ కామెడీ డ్రామాకు జాతీయ అవార్డు అవసరమా అని విమర్శి స్తున్నారు. యాక్షన్ సినిమా కథలు ఎవరైనా రాయగలరు. కానీ కామెడీ కథల్ని రాయడం అంత సులభం కాదు. ఇలాంటి చిత్రాలకు కూడా అవార్డులు వస్తాయని శోభన పాత్ర నిరూపించింది.
ఈ చిత్రంలో మిగతా పాత్రలు నేను చేయగలనా? అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏ పాత్ర ఇచ్చినా నేను నటించగలను. నాకు సంతోషం కలిగించే ప్రాతలు చేసినప్పుడే తృప్తిగా అనిపిస్తుంది. జానర్, కథని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం శోభన పాత్రనే దృష్టిలో పెట్టుకుని జ్యూరీ అవార్డు ఇచ్చింది.నేను ఇంట్లో.. నా మిత్రులతో కలిసి రాబోయే ప్రాజెక్టు గురించి చర్చిస్తున్నా. అదే సమయంలో ధనుష్ ఫోన్ చేసి ‘అభినందనలు.. నీకు జాతీయ అవార్డు వచ్చింది. నేను మొదట నమ్మలేదు.ఆయన నాతో జోక్ చేస్తున్నారని అనుకున్నా. కానీ నిజమని తెలిసాక నమ్మలేకపోయాను. అవార్డు ప్రకటించిన తర్వాత నాఫోన్ గ్యాప్ లేకుండా మోగింది. అందులో ప్రతీ రింగ్ నాకెంతో ప్రత్యేకమైనదే` అని ఆమె పేర్కొన్నారు.