ఈ ఆగష్టు 21న భారత్ మొత్తం బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత

"India shuts down completely on August 21st, marking a significant nationwide event."

దేశంలోని అనేక సమస్యలపై తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. మణిపూర్‌ అల్లర్లతోపాటు పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్‌ హత్యాచార ఘటన తో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యాపిస్తున్నాయి.ఇక రైతులు కూడా తమ డిమాండ్‌లపై మరోసారి తీవ్రస్థాయిలో ఉద్యమం నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మరో ఉద్యమం రాజుకుంటోంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమిస్తామని ఓ సంఘం ప్రకటించింది. అందులో భాగంగా భారత్‌ బంద్‌కు ఆ సంఘం పిలుపునిచ్చింది.

21 న భారత్ బంద్:

ఎస్సీ,ఎస్టీ విభజన, క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీల్లో గొడవలు సృష్టించడానికి ఈ వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి ఆరోపించింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తామని చెప్పింది.అందులో భాగంగా ఆగస్టు 21వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది.

Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?

దీనికోసం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశమైంది. ఆ సమితి కన్వీనర్ సర్వయ్య మాట్లాడుతూ.. ఎస్సీలు, ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ కుట్ర చేసిందని మండిపడ్డారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు అని ఇది బీజేపీ, నరేంద్ర మోదీ తీర్పు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణ వ్యతిరేక నినాదంతో పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొనాలని చెప్పారు.భారత్‌ బంద్‌తో ఎస్సీ, ఎస్టీల ఐక్యతను కేంద్ర ప్రభుత్వానికి చూపించాలని సూచించారు.

Leave a Reply