ఇప్పుడు స్టార్ హీరోయిన్ ….. ఒకప్పుడు న్యూస్ రీడర్

Now a star heroine ..... once a news reader

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలుసు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో చేస్తున్న పని. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. అయితే ఓ హీరోయిన్ ఓ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, తర్వాత స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. ప్రియా భవానీ శంకర్.

 

 

2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.ప్రియా భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఆమె మొదట న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.న్యూస్ రీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత, టెలివిజన్ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించింది. తన అభినయంతో మెప్పించింది.తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన ప్రియా భవాని శంకర్, తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కళ్యాణం కమనీయం’ వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి ఆదరణ లభించింది.

ఆమె ఎంచుకునే పాత్రలు, ఆమె నటనకు ప్రత్యేకతను చేకూర్చాయి. ప్రస్తుతం ప్రియా భవాని శంకర్ తమిళ , తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. రుద్రుడు,ఏనుగు,తిరు,చినబాబు,అహం బ్రహ్మస్మి,భీమా,రత్నం,జీబ్రా వంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రియా భవాని శంకర్ తన సహజమైన అందం మరియు అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Leave a Reply