కోల్‌కతా జూనియర్‌ రెసిడెంట్ డాక్టర్‌పై హత్య కేసు.. షాక్ కి గురిచేస్తున్న పోస్ట్‌మార్టం నివేదిక….

Murder case against Kolkata junior resident doctor.. Shocking postmortem report

కోల్‌కతాలోని జూనియర్‌ రెసిడెంట్ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో దిగ్భ్రాంతిగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి తెగబడిన దుర్మార్గుడు.. కళ్లు, గోళ్లు, మెడతో పాటు జననాంగాలపై గాయాలు చేసి అతి కిరాతకంగా ఆమె ప్రాణాలు తీశాడు. ఉక్కిరిబిక్కిరి చేసి, గొంతు నులిమి చంపేయడంతో థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయినట్లు తెలిపారు . ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న బాధితురాలు.. తన సహచరులతో కలిసి ఒలింపిక్స్‌ చూసింది. నీరజ్ చోప్రా మ్యాచ్ ముగిసిన తర్వాత తోటి వైద్యులతో కలిసి డిన్నర్ పూర్తిచేసి.. సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్లింది. కానీ, అదే ఆమె పాలిట శాపంమైంది.

తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. ఆమెను హత్య చేసినట్టు పోస్ట్‌మార్టమ్ నివేదిక లో గుర్తించారు . బాధితురాలి బొడ్డు, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు గుర్తులు ఉన్నాయి. ఆమె కేకలు వేయకుండా నోరు మూసేసి.. తలను గోడ లేదా నేలకు బలంగా కొట్టినట్టు గుర్తించారు. సహాయం కోసం అరవకుండా బాధితురాలి నోరు, గొంతును నిరంతరం నొక్కి ఉంచారని, కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగిందని నివేదిక తెలిపారు .

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌‌ను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన ఆర్జీ రాయ్ ఆస్పత్రి వద్ద ఉండే పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద నిందితుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. పోర్న్‌కు బానిసైన కామాంధుడు.. హింసాత్మక క్లిప్‌లను చూసేందుకు ఇష్టపడుతాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అతడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు గుర్తించారు. ఇక, నేరం చేసిన తర్వాత తన బ్యారక్‌కు వెళ్లిన సంజయ్ రాయ్ చాలా గంటలు నిద్రపోయినట్టు తేలింది. మేల్కొన్న తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకోడానికి బట్టలు ఉతికేసి.. షూపై రక్తపు మరకలు తుడిచేశాడు. ఘటనా స్థలిలో బ్లూటూత్ హెడ్‌సెట్‌ ఆధారంగా నిందితుడ్ని గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేశారు.

ముఖంపై నిందితుడు గోటిగుర్తులను బట్టి.. ఆమె తీవ్రంగానే ప్రతిఘటించినట్టు స్పష్టం చేస్తున్నాయి. ‘వైద్యురాలు గాఢనిద్రలో ఉండటం వల్ల నిందితుడి అనుకూలంగా మారింది.. మెలకువ వచ్చిన తర్వాత ప్రతిఘటించడంతో నిందితుడితో పాటు ఆమె చేతులకు గోళ్లతో రక్కిన గాయాలు ఉన్నాయి.. నిందితుడు సంజయ్ శరీరంపై ఉన్న రక్కిన గాయాలు.. బాధితురాలి గోళ్లు, రక్త నమూనాలతో నరిపోలాయి.. ’అని నివేదిక పేర్కొంది. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి కంటే ఎక్కువ మంది దీని వెనుక ఉండి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply