ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు… లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్

క్రికెట్ చరిత్రలో ఎన్నో చెత్త రికార్డులు ఉన్నాయి.ఈచెత్త రికార్డు లో చేరాలని ఏ ఒక్కరూ కోరుకోరు. అయితే, కొందరు మాత్రం ఊహించని విధంగా ఈ చెత్త రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఒక ఓవర్‌లో అత్యధిక బంతులు విసిరిన చెత్త రికార్డును ఎవరో సొంతం చేసుకున్నారో తెలుసుకుందాం…

Cricket Records:

క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌కి రనౌట్ కావడం అత్యంత విషాదరకంగా మారుతుంది. అదేవిధంగా బౌలర్‌కు, ఓవర్‌లో 6 కంటే ఎక్కువ బంతులు వేయడం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ చరిత్రలో, ఒక ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన వారి జాబితాలో ఐదుగురు బౌలర్లు ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బెర్ట్ వాన్స్ (న్యూజిలాండ్): క్రికెట్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన ఆటగాడిగా న్యూజిలాండ్ స్పిన్నర్ బెర్ట్ వాన్స్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 20 ఫిబ్రవరి 1990న, న్యూజిలాండ్ స్పిన్నర్ బెర్ట్ వాన్స్ వెల్లింగ్టన్ తరపున ఆడుతూ.. కాంటర్‌బరీతో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో గరిష్టంగా 22 బంతులు విసిరాడు. ఈ ఓవర్‌లో 77 పరుగులు ఇచ్చాడు. 1990లో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో కాంటర్‌బరీ ప్లేయర్ లీ జర్మన్ ఒకే ఓవర్‌లో 70 పరుగులు సాధించాడు. కాగా, అతని తోటి ఆటగాడు రోజర్ ఫోర్డ్ 5 పరుగులు తీసాడు.

 

 

Leave a Reply