మంకీపాక్స్ : కరోనా తర్వాత అంతటి రేంజ్ లో ప్రజలను భయపెడుతోన్న వ్యాధి గా మారింది. మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన లెక్కల ప్రకారం జనవరి నుంచి ఆఫ్రికాలో ఎంపాక్స్ కేసులు 18,737కు చేరినట్లు, మృతుల సంఖ్య 541కు చేరినట్లు తెలిపారు . తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోందని..
కొవిడ్ మహమ్మారి సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఇంతలోనే ప్రపంచానికి మంకీపాక్స్ కొత్త సవాల్ విసురుతోంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడం, మిగిలిన దేశాలకు కూడా ఇది చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ ఈ తరహా హెల్త్ ఎమర్జెన్సీ తెలిపారు రెండేళ్లలో ఇది రెండోసారి. 2022లో కూడా మంకీ పాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఎం-పాక్స్‌గా పిలిచే మంకీ పాక్స్ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించడంతో అటు ఆఫ్రికా దేశాలతో పాటు ఇటు ప్రపంచ దేశాలు భయపెడుతుంది .
కరోనా తర్వాత అంతటి రేంజ్ లో భయానకంగా ఈ వ్యాధి మారింది. మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన లెక్కల ప్రకారం జనవరి నుంచి ఆఫ్రికాలో ఎంపాక్స్ కేసులు 18,737కు చేరినట్లు, మృతుల సంఖ్య 541కు చేరినట్లు తెలుస్తోంది. తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని WHO హెచ్చరికలు జారీ చేసింది. గతంలో కూడా మంకీపాక్స్ వైరస్ వెలుగు చూసినప్పటికీ ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది . ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్థాన్‌లోనూ ఎంపాక్స్ కేసులు గుర్తించినట్లు WHO ప్రకటించడంతో టెన్షన్ మరింత ఎక్కువైంది.