వెడ్డింగ్ కార్డ్‌పై మోదీ ఫోటో …. చూస్తే వావ్ అనాల్సిందే!

Modi's photo on the wedding card .... Wow!

పెళ్లి.. ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్వీట్‌ మెమరీ. వెడ్డింగ్‌ కార్డ్‌ మొదలుకొని పెళ్లి మంటపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటాం. ఈ క్రమంలోనే స్నేహితులు, బంధుమిత్రులకు ఇచ్చే శుభలేఖలు రోజురోజుకు కొత్త మార్ఫులు కోరుకుంటుంన్నారు .

పెళ్లి.. ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్వీట్‌ మెమరీ. వెడ్డింగ్‌ కార్డ్‌ మొదలుకొని పెళ్లి మంటపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటాం. ఈ క్రమంలోనే స్నేహితులు, బంధుమిత్రులకు ఇచ్చే శుభలేఖలు రోజురోజుకు కొత్త మార్ఫులు కోరుకుంటుంన్నారు . శుభలేఖలు అనగానే ఒకప్పుడు తేదీ, వరుడు, వధువు, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. కానీ, కొందరు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి తమ అభిమానాన్ని పెళ్లి పత్రికల్లో తెలుపుతున్నారు . లేటెస్ట్‌గా నిర్మల్ జిల్లాలో ఓ యువకుడు పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్‌ చేయించాడు. ఇప్పుడీ ఇన్విటేషన్‌ కార్డే అక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది.

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హాల్దా గ్రామానికి చెందిన రోహిత్ ధర్మసేన అనే యువకుడి వివాహం ఆగస్ట్ 18వ తేదీన జరగనుంది. అయితే, తన పెండ్లి పత్రికపై భారతదేశ చిత్రపటంతో పాటు భారతమాత చిత్రాన్ని కూడా ముద్రించాడు. పెళ్లి కార్డులో వికసిత్ భారత్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయాలు తెలిపే విషయాలు అందులో ప్రింట్ చేయించాడు. ఇలా ప్రధానమంత్రి మోదీపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు రోహిత్. అదేవిధంగా బంధుమిత్రులకు ఆ శుభలేఖలను అందజేశారు. ఈ క్రమంలోనే శుభలేఖను చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడైన కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ద్వారా శుభలేఖను అందేలా ప్రధాని కార్యాలయానికి అర్జీ పెట్టుకున్నట్లుగా వరుడు రోహిత్ ధర్మసేన తెలిపాడు.

Leave a Reply