ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ..

Meteorological Department's announcement of favorable weather for Delhi, bringing relief and positivity to the residents."

కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఢిల్లీలో పదేళ్ల తరువాత ఆగస్టు నెలలో అధిక వర్షపాతం నమోదయినట్టు చెప్పింది.ఆగస్టు 22 నాటికి ఢిల్లీలో 266.9 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయినట్టు ప్రకటించింది. 2013 ఆగస్టులో 321 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అయితే రానున్న వారం రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించడంతో ఈ నెలలో మరింత వర్షపాతం నమోదుకానుంది. 1961 ఆగస్టులో రికార్డు స్థాయిలో 583.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.భారత వాతావరణ శాఖ (IMD) డేటా ప్రకారం 2012 ఆగస్టులో ఢిల్లీలో మొత్తం 22 రోజులు వర్షం పడింది. ఈ ఏడాది ఈ రికార్డును అధిగమించే అవకాశం కనబడుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.ఇప్పటివరకు ఈనెల 22 రోజుల్లో 20 రోజులు వర్షం కురిసింది. ఈ ఆగస్టులో ఎక్కువ రెయినీ డేస్ రికార్డు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా, 2012 ఆగస్టులో 378 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Study: Climate-changed rainfall dampens economic growth » Yale Climate  Connections

శుక్రవారం ఢిల్లీలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈసారి మాన్‌సూన్‌ సీజన్‌లో (జూన్ నుంచి సెప్టెంబర్) ఇప్పటివరకు ఢిల్లీలో 717 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2021 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ వెల్లడించింది. ఢిల్లీలో నాలుగు నెలల సగటు వర్షపాతం 640.4 మిల్లీమీటర్లగా ఉంది.

Leave a Reply