రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలుసు. ఆయన నటించిన ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఈక్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో ఉన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదచేసారు.
ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫ్ఐర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఒకరాత్రి ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్‌పై మెగా ఫ్యామిలీ పెద్దగా రియాక్ట్ కాలేదు.గత కొంతకాలంగా అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ దూరం పెడుతూ వస్తోంది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ జనసేన పార్టీని కాదని, వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడంతో వీరి మధ్య దూరం పెరిగింది. అల్లు అర్జున్ ఘటనపై చిరంజీవి ఎక్కడా కూడా స్పందించలేదు. అటు పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్‌కు వచ్చి కూడా అల్లు అర్జున్‌ను కలవకుండానే వెళ్లిపోయారు. దీంతో వీరి మధ్య సయోధ్య కుదరలేదని అంతా అనుకున్నారు.
మహిళ చనిపోయిన విషయం తెలియగానే ఎంతో బాధపడ్డాను. అందరి మద్దతుతో అల్లు అర్జున్ ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారని నిహారిక పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్ట్‌పై మెగా డాటర్ నిహారిక తొలిసారి స్పందించారు. నిహారిక నటించిన ‘మద్రాస్ కారన్’ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నిహారిక మాట్లాడుతూ… ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని ఆమె తెలిపారు.