మీనాక్షి చౌదరి.. ఓ స్పెషల్ రిక్వెస్ట్‌తో ప్రేక్షకులను పలకరించారు ………

Meenakshi Chaudhary greeted the audience with a special request.
Meenakshi Chaudhary :ఇంకొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ సందడి వస్తుంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు రెడీగా ఉన్నాయ్. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది. అదే సమయంలో కొత్త సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి. స్టార్ హీరోలు నటించిన మూవీలు థియేటర్లను ముంచెత్తనున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతోంది. 300 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిన మూవీ ఇది. ఎస్ శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత.

నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్. 12న థియేటర్లలోకి వస్తుంది. బాబీ కొల్లి దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవితో తీసిన వాల్తేరు వీరయ్య తరువాత ఆయన దర్శకత్వంలో రాబోతోన్న మూవీ ఇదే కావడం, దీని టైటిల్, బాలయ్య గెటప్ కొత్తగా ఉండటం సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ పేరుకు తగ్గట్టే పండగ రోజున అంటే 14వ తేదీన విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోందీ మూవీ యూనిట్. ఈ క్రమంలో మీనాక్షి చౌదరి.. ఓ స్పెషల్ రిక్వెస్ట్‌తో ప్రేక్షకులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకుడు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, నరేష్, రాజేంద్రప్రసాద్, వీటీవీ గణేష్, సాయికుమార్.. ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొందీ మూవీ. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించిన వీడియో అది. సోషల్ మీడియాలో నెగెటివిటీ విస్తృతంగా ప్రచారమౌతోన్న నేపథ్యంలో ఆమె యూజర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.

ఈ తరానికి సోషల్ మీడియా అనేది ఓ వరంలాంటిదని, ఈ మధ్యకాలంలో ఈ ప్లాట్ ఫామ్‌పై నెగెటివిటీ పెరుగుతుంది మీనాక్షి చౌదరి అన్నారు. ఒక ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని, దాని వల్ల ఎవరైనా ఇబ్బంది పడొచ్చని ఛేఫుకొచ్చారు. ఒక ఆడపిల్ల ఫొటో కింద బ్యాడ్ కామెంట్ చేసే ముందు- అది ఆ అమ్మాయిని ఎంతలా అఫెక్ట్ చేస్తుందనే విషయాన్ని ఒక్కసారి సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు. సోషల్ మీడియాను మనం మంచి కోసం వాడుదామని, చెడు కోసం కాదని అన్నారు. సోషల్ మీడియాలో నెగెటివిటీని తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రచారంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.

Leave a Reply