న్యాయదేవత అయిన శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తున్నాడు. మంచి చేస్తే అంతకు రెట్టింపు ప్రయోజనాలను, చెడు చేస్తే అంతకు రెట్టింపు ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. మరికొన్ని రాశులకు రాజయోగం పడుతుంది. ఏయే రాశులకు ఏవిధంగా లాభాలున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. మార్చి 29వ తేదీన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలగనున్నాయి.
మిథున రాశి వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అందుకు ఖర్చు బాగానే అవుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పై అధికారులు సహకరిస్తారు. శనిదేవుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. దీనివల్ల మంచి లాభం పొందుతారు.
మేష రాశి చురుగ్గా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. కష్టానికి తగినట్లుగా ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో ఊహించనిరీతిలో లాభాలున్నాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. . ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగస్తులకు బదిలీలున్నాయి. కాకపోతే అవి వారికి సంతోషాన్నే ఇస్తుంది.వైద్యఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి
కన్యా రాశి వీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. కొత్తగా ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కొంతకాలం ఆస్తులకు సంబంధించిన వివాదాలున్నాయి. అవి ఈ సమయంలో పరిష్కారమవుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం. కొత్తగా అవకాశాలు తలుపుతడతాయి. ఉద్యోగులకు వేతనం పెరుగుతుంది. మాటతీరు సరిగా లేకపోతే కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి.