ఖగోళంలో సంచరించే గ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయదేవత. అత్యంత నెమ్మదిగా తిరుగుతున్నాడు . ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్ఫు చెందుతాడు . చేసిన కర్మల ప్రకారం రాశిచక్ర గుర్తులకు ఫలితాలను ప్రసాదిస్తుంటారు. మీనరాశిలోకి రావడంవల్ల కొన్ని రాశులవారికి మంచి యోగ ఫలితాలున్నాయి. అవి ఏవేమిటనేది తెలుసుకుందాం. ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రయాణిస్తున్న శనిదేవుడు ఈ ఏడాది మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం తన సొంత రాశిలోకి కూడా 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు.
కన్యా రాశి :
ఈ రాశివారికి కొత్త సంవత్సరంలో శనిదేవుడు గొప్ప లాభాలను కలిగించబోతున్నాడు. పెళ్లికానివారికి పెళ్లి జరుగుతుంది. ఆరోగ్యం చేకూరడంవల్ల పనులన్నీ చకచకా పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి పురోగతి కనపడుతోంది. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తిచేసి కొత్త పనులను ప్రారంభిస్తారు.ఈ సమయంలో బంధువుల నుంచి సహకారం అందుతుంది.
మకర రాశి :
ఈ రాశివారికి డబ్బుకు ఎటువంటి లోటు జరగదు. వైవాహిక జీవితం మీలో మార్పును తీసుకువస్తుంది. ప్రేమికులకు కూడా జీవితం చాలా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతోపాటు ఉద్యోగాలు చేస్తున్నవారికి తోటి ఉద్యోగుల నుంచి సహాయం అందుతుంది. అనారోగ్యం కుదుటపడుతుంది. మాట్లాడే సమయంలో మాటతీరు మృదువుగా ఉంటనే పనులు ఈ రాశివారు నోరును అదుపులో ఉంచుకోవాలి. లేదంటే నష్టాలు కలుగుతాయి. కోలుకోలేని దెబ్బ తగులుతుంది. పూర్తిచేసుకోగలుగుతారు.
వృషభ రాశి :
కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి శనిదేవుడి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల నుంచి మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారులు సంపూర్ణంగా సహకరిస్తారు. వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఆనందంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి.