కమ్మలు పెట్టానుచూడవా సాంగ్ గుర్తుచేస్తున్న….కోడిపుంజు

Kammalu Pettanuchudava song reminds....Kodipunju

వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ఓ వింత ఘటన జరిగింది . భక్తులు అమ్మవారికి సమర్పించే బోనాలతో పాటు బలిచ్చేందుకు తీసుకొచ్చిన కోడిని కూడా ఎంతో అందంగా రెడీ చేసారు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కోడికి చెవిపోగు, దాని మెడలో క్వార్టర్ బాటిల్ వేసి ముస్తాబు చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో ఈ వింత దృశ్యం కనిపించిందిని .

తెలంగాణలో గత నెలరోజులుగా బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆషాడం సందర్భంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మహాంకాళి, ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు భక్తులు. ఇక ఇప్పుడు తెలంగాణలోని జిల్లాల్లో శ్రావణమాస బోనాల సందడి షురువయ్యింది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో ఓ వింత దృశ్యం భక్తులు, గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఒక కుటుంబీకులు గ్రామ దేవతకు మొక్కులు చెల్లించే క్రమంలో బలిచ్చే కోడిని ముస్తాబు చేసిన విధానం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ఈ సందర్భంగా దేవతకు బలిచ్చే మేకల్ని, కోళ్లను ఇలా కాళ్లకు పసుపు రాసి, కుంకుమ బోట్టు పెడుతుంటారు. అలాగే, ఓ కుటుంబ సభ్యులు అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు గానూ బలిచ్చేందుకు తయారు చేసిన కోడి చెవులకు ఓలలు కట్టి, కత్తికి పూలమాలలు వేసి కోడిని బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. పైగా ఆ కోడి మెడలో మద్యం బాటిల్‌ కూడా వేలాడదీశారు. ప్రస్తుతం ఈ వింత ఘటనకు సబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Leave a Reply