అది తాగితే చాలట..! ఏజెన్సీలో సీజనల్ జ్వరాలకు చెక్..

It is enough to drink it..! Check for seasonal fever in the agency.

వర్షాకాలం, ఆపై పారిశుధ్య లోపం.. ఇంకేముంది ఎక్కడ చూసినా సీజనల్ వ్యాధులు విజృంభణ.. పిల్లల కోసం నుంచి పెద్దల వరకు విష జ్వరాలు , టైపాయిడ్, డెంగ్యూ బారిన పడి.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రులు కలకలలాడుతున్నాయి. కొందరికి రోజులు తరబడి చికిత్స అందించాల్సిన పరిస్థితి.

It is enough to drink it..! Check for seasonal fever in the agency.

సీజనల్, వైరల్‌ జ్వరాలతో జనం వణికిపోతున్నారు. వర్షాకాలం, అందులోనూ మారిన వాతావరణ పరిస్థితులతో వ్యాధులు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో జనం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

అంటు వ్యాధులు ప్రబలకుండా సాంప్రదాయమైన దివ్యౌషధాలను తీసుకుంటున్నారు. విష జర్వాలు సోకకుండా స్థానికంగా దొరికే ముడి లంద పానీయం తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారట. వర్షాకాలం వచ్చిందంటే చాలు ముందుగానే రెండు రోజులపాటు బియ్యాన్ని నానబెట్టి మెత్తగా దంచి కాచిన లంద అనే పానకాన్ని తయారు చేసుకుంటారు. ఆదివాసీ గ్రామ గిరిజనులంతా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ ద్రవాన్ని తాగుతున్నారు. వయస్సుతో తేడా లేకుండా పచ్చటి ఆకులను దొప్పలుగా మలిచి తాగేస్తున్నారు.

ఆదివాసీలంతా ఒకే చోటుకు చేరి మమేకమై సేవించడంతో ఎటువంటి ఏ చిన్న జబ్బులు కూడా ఆ గిరిజన గ్రామం దరి చేరవని వారి నమ్మకం. నిత్యం పచ్చటి ప్రకృతి మధ్య స్వచ్ఛమైన గాలి పీల్చుతూ కష్టాన్నే నమ్ముకున్న వీరికి జబ్బున పడి టాబ్లెట్ వేసుకున్నవారు లేరంటే నమ్మశక్యం కాదు..!

Leave a Reply