ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మధ్యనే ఒక సినిమా ఓపెనింగ్ ఘనంగా జరిగింది.ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమాలో పాకిస్తానీ నటి ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది.ఆమెను తెచ్చి ఇమాన్విగా నామకరణం చేసి ప్రభాస్ పక్కన నిలబెట్టారు. ఆమె ప్రభాస్ పక్కన ఏ మాత్రం అనడం లేదని ఒక వర్గం భావిస్తుంటే ప్రభాస్ పక్కన బలే క్యూట్ గా ఉంది అని మరో వర్గం భావిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉందనే చెప్పాలి.
ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఎనిమిది లక్షల అరవై మూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాస్ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత మరింత మంది ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సుర్ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్ కూడా కేవలం సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ నుంచి ఆమెకు రెండు లక్షల రూపాయలు నెలకు వస్తున్నాయంటే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమెను తెచ్చి ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పెట్టడమే కాదు ఏకంగా మొదటి సినిమాకే కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారట మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ఒకరకంగా ఇది రికార్డు రెమ్యూనరేషన్ అనే చెప్పాలి ఇలా తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తున్నప్పుడే భారీ మొత్తాన్ని చెల్లించింది. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఇది చిన్న అమౌంట్ అనిపించొచ్చు కానీ మొదటి సినిమాకే ఇంత ఆఫర్ రావటం అనేది మామూలు విషయం కాదు.
ప్రభాస్ సినిమా హిట్ అయితే కనుక ఆమె రెండో సినిమాకి ఐదు కోట్లు డిమాండ్ చేసిన ఆశ్చర్యం లేదు అని ట్రేడ్ వర్గాల వారు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెకు సంబంధించిన పాత డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఆమె డాన్స్ ను ప్రభాస్ మ్యాచ్ చేయగలడా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.