భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందరరాజన్ పద్మనాభన్ (83) సోమవారం మరణించారు . గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని స్వగృహంలో మరణించారు . పద్మనాభన్ 2000 సంవత్సరం నుంచి 2002 వరకు రెండేళ్లపాటు 20వ ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు..
చెన్నై: భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందరరాజన్ పద్మనాభన్ (83) సోమవారం మరణించారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని స్వగృహంలో మరణించారు. పద్మనాభన్ 2000 సంవత్సరం నుంచి 2002 వరకు రెండేళ్లపాటు 20వ ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2002 డిసెంబర్ 31న సుందర రాజన్ ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ పొందారు. పద్మనాభన్ మృతి చెందిన విషయాన్ని ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
పద్మనాభన్ కెరీర్‌లో 15వ కార్ప్స్ కమాండర్‌గా జమ్మూ కాశ్మీర్‌లో మిలిటెన్సీతో ఆయన చేసిన కృషి దశాబ్దాల కృషి ఎనలేనిది. జూలై 1993 నుంచి ఫిబ్రవరి 1995 వరకు కాశ్మీర్ లోయలో లెఫ్టినెంట్ జనరల్‌గా,15 కార్ప్స్ కమాండర్‌గా జనరల్ పద్మనాభన్ ఆధ్వర్యంలో కాశ్మీర్‌లో మిలిటెంట్లపై జరిపిన పోరాటాల్లో కీలకపాత్ర పోషించారు. అప్పట్లో ఆయన సార్థధ్యంలో కశ్మీర్‌లోని మిలిటెంట్ల కార్యకలాపాలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి.15వ కార్ప్స్ కమాండర్‌గా ఆయన అందించిన సేవలకుగానూ అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) అందుకున్నారు. అనంతరం జనరల్ పద్మనాభన్.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (DGMI)గా నియమితులయ్యారు. అతను ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా నియమించబడక ముందు నార్తర్న్ కమాండ్‌కి, సదరన్ కమాండ్‌కి GOCగా పనిచేశారు. 2002లో పద్మనాభన్ పదవీ విరమణ తర్వాత చెన్నైలో సెటిల్ అయ్యారు.