క్రమశిక్షణ నేర్పే దేవుడు కర్మ ఫలితాలను అందించే దేవుడు అయిన శని దేవుడు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు. శని దేవుడి అనుగ్రహం కలిగితే వారు జీవితంలో కోటీశ్వరులుగా మారతారు. ప్రతి 2న్నర సంవత్సరాలకు ఒకసారి శని తన రాశిని మారుస్తూ ఉంటాడు. శని రాశి మార్పుతో ఏలినాటి శని నుండి వీరికి విముక్తి గ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహమైన శని మార్చి నెలలో మీన రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా కొన్ని రాశుల వారికి ఏలినాటి శని నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇక ఇంతకాలం ఏలినాటి శని తో కష్టపడిన వారు రాజభోగాలను అనుభవించడం మొదలుపెడతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం చూదాం.
మీనరాశి : శనిదేవుడి రాశి సంచారం మీనరాశి జాతకులకు మంచి లాభాలను కలిగిస్తుంది. శని సంచారం కారణంగా వీరి జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషం తొలగిపోయి అనేక విధాలుగా లాభం పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది .ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు శని దేవుడి కారణంగా వచ్చే ఏలినాటి శని దశ ముగిసే సమయం కావడంతో వీరు మార్చి నెలలో శని సంచారం తర్వాత శుభ ఫలితాలను పొందుతారు. కొన్ని సంవత్సరాలుగా వీరు పడుతున్న ఇబ్బందులు, బాధలు తొలగిపోతాయి. శని దేవుడి కారణంగా జీవితంలో ఎదురైన సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దీంతో ఆర్థిక పురోగతి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలలో లాభాలను పొందుతారు
మకర రాశి : మకర రాశి వారికి కూడా ఏలినాటి శని నుంచి 2025 సంవత్సరంలో ఉపశమనం లభిస్తుంది. కుంభరాశి నుంచి మీన రాశిలోకి శని సంచారం కారణంగా మకర రాశి వారికి ధన సంపదల వరద కురుస్తుంది. హద్దులేని అదృష్టాలు మకర రాశి వారిని సంతోష సాగరంలో ముంచేస్తాయి. ఈ సమయంలో మకర రాశి వారు ఏ పని చేసినా తిరిగిలేదు అనేది ఉండదు. మకర రాశి వారి దిగ్విజయ యాత్ర కొనసాగుతుంది.
గమనిక: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.