ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోకన్నా హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా రూ.1850 కోట్ల వరకు సాధించి దంగల్ రికార్డును బద్దలుకొట్టే దిశగా వేగంగా దూసుకుపోతోంది. దంగల్ సినిమా రూ.2వేల కోట్లు రాబట్టింది. ఈ సినిమా మనదేశంలో కేవలం రూ.700 నుంచి రూ.750 కోట్ల వరకే రాబట్టగా, చైనాలో దాదాపు రూ.1300 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమాలో మొదటిసారి రూ.2వేలు రాబట్టిన చిత్రంగా ఉంది. 17వ తేదీ నుంచి పుష్ప2లో అదనంగా 20 నిముషాల సన్నివేశాలను జతపరుస్తుండటంతో కలెక్షన్లు పెరుగుతాయని చిత్ర బృందం తెలిపింది.
నా జీవితంలో అది ప్రత్యేకంగా నిలిచిపోతుంది తాజాగా సంక్రాంతి పర్వదినం రావడంతో ఐదు సంవత్సరాల క్రితం ఇదే పండగకు అల్లు అర్జున్ నుంచి అల వైకుంఠపురం సినిమా విడుదలైంది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానరుపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ స్వరాలందించారు. సంగీతం పరంగా కూడా ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయింది. కొన్ని పాటలకు అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. వీటిని కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ అందించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. తనకు ఈ సినిమా ఒక తీపి గురుతు అన్నారు. 5 సంవత్సరాల క్రితం ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన అందరి ఫొటోలను షేర్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అల వైకుంఠపురం సినిమా తన హృదయంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని, అందుకు కారకులైన త్రివిక్రమ్, చినబాబు (నిర్మాత), అల్లు అరవింద్, తమన్ అన్నయ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు
దీనికి కూడా రెండు సంవత్సరాలు తప్పదు పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానరుతోపాటు, గీతా ఆర్ట్స్ కూడా భాగస్వామి కాబోతోంది. హీరోయిన్ ఖరారు కాలేదు. మార్చిలోకానీ మేలోకానీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం షూటింగ్ కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు.