కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కొణిదెల ఉపాసన ఎక్స్ వేదికగా ఆవేదన తెలియచేసారు . కొందరిలో కనీస మానవత్వం ఉండడం లేదని విచారం తెలియచేసారు . మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది అని పేర్కొన్నారు. సమాజంలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నామని ఆమె ప్రశ్నించారు. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని తెలిపిన ఉపాసన.
దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని తెలిపిన ఉపాసన.. ఈ రంగంలోని వర్క్‌ఫోర్స్ లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారని చెప్పారు. అంతేకాదు, పలు అధ్యయనాలు మహిళా హెల్త్ వర్కర్లే రోగులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తేల్చాయని గుర్తు చేశారు. మహిళలు మన హెల్త్ రంగానికి చాలా అవసరమని తెలిపారు . కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కొణిదెల ఉపాసన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరిలో కనీస మానవత్వం ఉండడం లేదని విచారం వ్యక్తం చేశారు. మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది అని పేర్కొన్నారు. సమాజంలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నామని ఆమె అడిగారు.
అందుకే ఎక్కుమంది మహిళలను వర్క్‌ఫోర్స్ లోకి, అందులోనూ హెల్త్‌కేర్ విభాగంలోకి తీసుకురావడం తన లక్ష్యం అన్నారు. ఈ విభాగంలో వారి అవసరం చాలా ఉందన్నారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో ప్రతి మహిళకు భద్రత, గౌరవం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని ఉపాసన చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా స్పందించారు. మరో దారుణమైన హత్యాచారం. మహిళలకు ఎక్కడా రక్షణ లేదని అర్థమవుతోంది. ఇది పదేళ్ల క్రితం జరిగిన నిర్భయ విషాదంలా ఉంది. మహిళల భద్రత విషయంలో మార్పులు తీసుకురావాలి’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన ఈ హత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్‌రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.