‘ఎంఎస్ ధోని’ని అలా వదులుకున్న – హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్

Heroine Rakul Preet Singh gave up 'MS Dhoni' like that

 

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలుసు. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు ఉంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం లేదు.

దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరుచు వార్తల్లో నిలుస్తున్నారు.

 

నా జీవితంలో నెపోటిజం కారణంగా ఎన్నో చాన్స్‌లు వదులుకున్నాను. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉన్నమాట నిజమే. అవకాశాలు కోల్పోయానని నేను ఎప్పుడు బాధపడలేదని తెలిపింది. ఈ సందర్భంగా నా లైఫ్‌లో ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నానని తెలిపింది. స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ సినిమాలో అవకాశం వచ్చిన దాన్ని వదులుకున్నానని రకుల్ చెప్పుకొచ్చింది. సినిమాలో ముందుగా నన్ను ఎంపిక చేసుకున్నారు దర్శక, నిర్మాతలు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల మంచి అవకాశాన్ని పొందలేదు.

ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్ సింగ్, దిశా పటానీ, కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే.దీనికి సంబంధించిన రీడింగ్ పలు పనులన్ని కూడా కంప్లీట్ చేశారు. కానీ నేను అప్పుడే రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ సినిమాలో నటిస్తున్నాను. రెండు సాంగ్స్ ఇంకా చిత్రీకరణ పూర్తి కాలేదు. దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఎంఎస్ ధోని చిత్రం నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చింది.ఆ సమయంలో మంచి సినిమా చేజారిపోయిందని చాలా బాధపడ్డానని రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

Leave a Reply