ట్రాన్స్‌జెండర్లకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

"Government announces a key decision in support of transgender rights, promoting inclusivity and opportunities for the transgender community."

ఆంధ్రప్రదేశ్‌లోని ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి చెప్పారు.అమరావతిలోని సచివాలయంలో ఏపీ సాంఘిక సంక్షేమశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

AP govt. brings good news for government employees

ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై సమీక్ష జరిపారు. ఈ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు మంత్రికి మంచిగా వివరించారు.ఈ సందర్భంగానే ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసారు.

Leave a Reply