టాటా యూజర్లుకి గుడ్ న్యూస్….సరికొత్తగా టాటా నానో రీఎంట్రీ….

Good news for Tata users

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ హవా నడుస్తోంది. సామాన్యుల కోసం మళ్లీ టాటా నానో కారు సరికొత్తగా రాబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈసారి ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వస్తుందని టాక్‌.

Tata-Nano

వాహన రంగంలో టాటా మోటార్స్ మంచి గుర్తింపు ఉన్న బ్రాండ్‌. టాటా సుమో, టాటా ఏస్, టాటా ఇండికా వంటివి ఎంతో పాపులర్ అయ్యాయి. టాటా కంపెనీ నుంచి అప్పట్లో కేవలం లక్ష రూపాయల బేసిక్ ధరలోనే ఐకానిక్ నానో కారు లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. కొన్ని కారణాలతో టాటా నానో సక్సెస్ కాలేదు. మార్కెట్లో వీటి ఉత్పత్తి కూడా ఆగిపోయింది. తాజాగా మరోసారి నానో కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ కొత్త ఏడాది లో మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్‌ తో ఉంటుందని సమాచారం. టాటా నానో ఈ కొత్త వెర్షన్ 2025 ప్రారంభంలో రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేవలం రూ.2.5 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికిల్‌ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు సమాచారం. టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర రూ.2.5 లక్షలతో ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హైఎండ్ ఫీచర్స్‌తో కూడిన టాప్ వేరియంట్ ధర రూ.8 లక్షల వరకు ఉండొచ్చని నిపుణుల
సమాచారం. అయితే.. ధరపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

Leave a Reply