స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా ఆగస్టు నెలలో ఎక్కువగా సెలవులు వచ్చాయి. ఈ నెలలోనే ఎన్నో పండుగలతో పాటు.. సెషల్ డేస్ కూడా ఉండటంతో వరుస పెట్టి సెలవులు వచ్చాయిస్కూల్స్, కాలేజీ విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా ఆగస్టు నెలలో ఎక్కువగా సెలవులు వచ్చాయి. ఈ నెలలోనే ఎన్నో పండుగలతో పాటు.. స్పెషల్ డేస్ కూడా ఉండటంతో వరుస క్రమం లో సెలవులు వచ్చాయి.
అయితే తాజాగా ఈ సెలవుల జాబితాలోనే మరో సెలవు వచ్చి చేరింది. ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం కారణంగా పబ్లిక్ హాలిడే ఉండగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఆగస్టు 17న సెలవు ఉండనుంది. ఆగస్టు 18 ఆదివారం, ఆగస్టు 19న రాఖీ పౌర్ణమి సందర్భంగా వరుస సెలవులు వచ్చాయి.
దీంతో ఆగస్టు 21న బుధవారం రోజున దేశంలోని అన్ని కాలేజీలు, పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ఇచ్చే అవకాశం ఉంది . దీంతో ఈ నెలలో విద్యార్థులకు మరో హాలిడే జాతర కానుంది. ఈ సెలవుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఇదిలా ఉండగా.. 2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన సెలవుల విషయానికి వస్తే.. దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి. క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
అక్టోబరు 31న దీపావళి సెలవు, డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయని అకాడమి క్యాలెంటర్లో కూడా ప్రకటించారు.