రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద టికెట్ల కొనుగోలు చేసే ప్రాసెస్ ఇకనుంచి అత్యంత సులభతరం కానున్నది. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించింది.అయితే, తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉండగా, ఇప్పుడు అన్ని స్టేషన్లకు వ్యాపించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొన్నది.ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఇక నుంచి డిజిటల్ చెల్లింపులు చేయొచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది.
ఇందుకోసం అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్ ను ఉంచుతున్నట్లు చెప్పింది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలను కంప్యూటర్ లో ఎంటర్ చేసిన తరువాత, ఆ డివైజ్ లో క్యూఆర్ కోడ్ కనిపిస్తాది. దీని ద్వారా యూపీఐ యాప్స్ వినియోగించి చెల్లింపులు చేయొచ్చు. పేమెంట్ పూర్తయిన వెంటనే టికెట్ ను అందిస్తారు.